తదుపరి వార్తా కథనం

Bihar : సీఎం కార్యాలయలానికి బాంబ్ బెదిరింపు.. కేసు నమోదు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 04, 2024
11:01 am
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపుతోంది.
ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయ భద్రతను వ్యవస్థను అప్రమత్తం చేసి, ప్రాంగణంలో అణువణువునా తనిఖీలు చేపడుతున్నారు.
సీఎం ఆఫీస్‌ను బాంబుతో పేల్చేస్తామని, బిహార్ స్పేషల్ పోలీసులు తమను అడ్డుకోలేరని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్స్ పంపారు.
తాము ఆల్ ఖైదాకు సంబంధించిన వాళ్లమని, గత నెల 16న వచ్చిన ఈ బెదిరింపు మెయిల్ పై బిహార్ పోలీసులతో పాటు, ఉగ్రవాద వ్యతిరేక దళం దర్యాప్తు చేపట్టింది.
Details
గతంలో కూడా బాంబు బెదిరింపులు
గతంలో పట్నా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. అయితే తనిఖీల తర్వాత బాంబు లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు
. మరోవైపు పట్నాలోని ఓ ఇంట్లో బాంబు తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో పవన్ మహతో అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.