Bomb threat: గురుగ్రామ్‌లోని మాల్‌కు బాంబ్ బెదిరింపు
హర్యానాలోని గురుగ్రామ్ నగరంలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌కు బాంబ్ బెదిరింపు వచ్చింది. గురుగ్రామ్‌లోని ఆంబియెన్స్ మాల్స్‌కు శనివారం ఈ మెయిల్ ద్వారా బాంబ్ బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన మాల్ అధికారులు అక్కడి నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. పోలీసులు, బాంబ్ స్క్యాడ్ ఘటనా స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా తనీఖీలు చేపట్టారు. అయితే ఇప్పటివరకూ మాల్‌లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును అధికారులు గుర్తించలేదు. కాగా ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి.
మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు
మాల్ మేనేజ్‌మెంట్‌కు వచ్చిన మెయిల్‌లో బిల్డింగ్‌లో బాంబులు అమర్చామని, ఏ ఒక్కరూ తప్పించుకోలేరని గుర్తు తెలియని వ్యక్తి తెలిపాడు. ఇదిలా ఉండగా నోయిడాలోని సెక్టార్ 18లోని డీఎల్ఎఫ్ మాల్‌లో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాంబదన్ సింగ్ పేర్కొన్నారు. ఈ డ్రిల్‌లో ఫైర్ సర్వీసెస్, డాగ్ స్క్యాడ్, పోలీసులు బృందాలు పాల్గొన్నాయి.