Bomb threat: గణతంత్ర దినోత్సవానికి ముందు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. నోయిడా,అహ్మదాబాద్‌లో కలకలం
ఈ వార్తాకథనం ఏంటి
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. నోయిడాలోని శివనాడర్ స్కూల్‌తో పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పలుచోట్ల ఉన్న పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమై భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.
వివరాలు
బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో సోదాలు
అహ్మదాబాద్‌లోని కొన్ని స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులకు సమాచారం అందడంతో, బాంబ్ స్క్వాడ్ బృందాలతో అక్కడికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇదే సమయంలో నోయిడాలోని శివనాడర్ స్కూల్‌కు కూడా బెదిరింపు మెయిల్ రావడంతో యాజమాన్యం తక్షణమే స్పందించింది. భద్రతా దృష్ట్యా విద్యార్థులను స్కూల్ నుంచి బయటకు పంపించి, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో సోదాలు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని, ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే, ఈ బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.