Parliament Winter Session: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ఉభయసభలు వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. అయితే, సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపట్లోనే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఈ రోజు వివాదాస్పద అంశం యూపీలోని సంభల్ హింసాకాండపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్ష పార్టీల ఎంపీలు తీవ్ర నినాదాలతో సభలో నిరసన తెలిపారు, దీనితో సభలో గందరగోళం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో స్పీకర్ ఓం బిర్లా, లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అలాగే, రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. విపక్ష ఎంపీల నిరసనల కారణంగా చైర్మన్ ధన్‌ఖర్ రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.