LOADING...
Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 04, 2025
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోగ్య సమస్యలకు గురయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన 'వెన్నుపోటు దినం' కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఆస్వస్థకు గురైన ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్టణం జిల్లాలోని చీపురుపల్లిలో ఈ కార్యక్రమాన్ని వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో బొత్స పాల్గొన్నారు. అయితే ర్యాలీ ముగిశాక వేదికపై ఉన్న సమయంలో ఆయన అకస్మాత్తుగా వడదెబ్బకు గురై అస్వస్థతకు లోనయ్యారు. అప్పుడే అక్కడున్న పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తమై ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 'వెన్నుపోటు దినం' నిర్వహణకు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Details

వైద్యుల పర్యవేక్షణలో బొత్స

నిన్నటితో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో, గడచిన ఐదేళ్లలో ప్రజలకు చేసిన మేలు మర్చిపోయి, ఇతర పార్టీలు ఎన్నికల హామీలు ఇస్తూ ప్రజలను మోసగించాయన్న ఆరోపణలతో ఈ నిరసన కార్యక్రమానికి రంగం సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని వైసీపీ విమర్శిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా 'వెన్నుపోటు దినం'ను జూన్ 4న నిర్వహించాలన్నది పార్టీ ఆదేశాలిచ్చింది. బొత్స సత్యనారాయణకి తక్షణమే వైద్యం అందించడంతో పరిస్థితి మెరుగుపడిందని సమాచారం. అయినప్పటికీ ఆయన ఆరోగ్యంపై వైద్యులు మరింత పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.