MLC Election: ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన బొత్స సత్యనారాయణ
విశాఖలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ . .విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ పార్టీకి పూర్తిగా బలం ఉందన్న ఆయన అనైతికంగా కూటమి సర్కార్ ఎందుకు అభ్యర్థిని పోటీలో నిలుపుతోందని ప్రశ్నించారు. వైస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నామినేషన్ వేసినట్లు తెలిపారు. తమకు 530 పైచిలుకు ఓట్ల బలం ఉందని చెప్పారు. వైసీపీ,కూటమి పార్టీల మధ్య 300 ఓట్ల వ్యత్యాసం ఉందని తెలిపారు. జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, అందరినీ కలిశామని తెలిపారు. రాజకీయం అంటే వ్యాపారం కాదని, కూటమి పార్టీ అభ్యర్థిని నిలబెడితే అది దుశ్చర్యే అవుతుందన్నారు.