
Boy Falls Into Borewell: కర్ణాటకలో బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని విజయపుర జిల్లా లచయన్ గ్రామంలో బుధవారం సాయంత్రం 2 ఏళ్ల బాలుడు పొలంలో ఉన్న బోరుబావిలో పడిపోయాడు.
15-20 అడుగుల లోతులో కూరుకుపోయిన బాలుడిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
బోరుబావిలో పడ్డ బాలుడిని సాత్విక్ ముజగొండగా అధికారులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడి తండ్రి సతీష్ ముజగోండ్ తన 4 ఎకరాల పొలంలో బోరుబావిను తవ్వంచాడు.
అయితే, బుధవారం సాయంత్రం పొలంలో ఆడుకుంటూ బాలుడు బోరుబావిలో పడిపోయాడు.
బుధవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.
Details
అందుబాటులో వైద్యుల బృందం
పోలీసు బృందాలు, రెవెన్యూ అధికారులు, తాలూకా పంచాయితీ సభ్యులు, అగ్నిమాపక శాఖ, అత్యవసర సేవల అధికారులు బోర్‌వెల్ నుండి చిన్నారిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు.
"బాలుడిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని సీనియర్ పోలీసు అధికారిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.
ఆయితే., బాలుడి కదలికలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. స్థానిక హెల్త్ ఆఫీసర్ డా. అర్చన నేతృత్వంలో వైద్యుల బృందం సిద్ధంగా ఉంది
ఈ ఘటనపై కర్ణాటక మంత్రి MB పాటిల్ స్పందించారు. శరవేగంగా ఆపరేషన్ నిర్వహించాలని విజయపుర జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించానని, పసిబిడ్డ తన తల్లిదండ్రులతో క్షేమంగా కలవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.