Page Loader
Big Breaking: ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా 

Big Breaking: ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా 

వ్రాసిన వారు Stalin
May 02, 2023
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన ప్రకటన చశారు. ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు శరద్ పవార్ ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన శరద్ పవార్ అనేక కీలక పదవులను నిర్వహించారు. పవార్ 1967లో మొదటిసారిగా మహారాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1978లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అతను తన రాజకీయ జీవితంలో మూడుసార్లు (1978-80, 1983-91, 1993-95) సీఎంగా కొనసాగారు. ఆరుసార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో రక్షణ (1991-93) సహా అనేక ముఖ్యమైన మంత్రిత్వ శాఖలకు పదవీ బాధ్యతలు నిర్వహించారు. 1999లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజీనామా చేస్తున్నట్లు శరద్ పవార్ ప్రకటన