'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్ ఎన్‌కౌంటర్ చేశారా?
ఝాన్సీ జిల్లాలో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు జరిగిన ఎదురుకాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కొడుకు అసద్ మరణించారు. అయితే 'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పోలీసులకు అసద్ ఎలా కార్నర్ అయ్యాడు. పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్ ఎన్‌కౌంటర్ చేశారా? తెలుసుకుందాం. గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడైన అతిక్ అహ్మద్‌ను పోలీసులు భారీ బందోబస్తు మధ్య గురువారం కోర్టుకు తరలించారు. ఈ క్రమంలో అతిక్ అహ్మద్‌ను తప్పించుకోవడానికి అతను ప్రయాణిస్తున్న పోలీసు కాన్వాయ్‌పై దాడి చేయడానికి అసద్, అతని సహాయకుడు గులాం ప్లాన్ చేస్తున్నారనే తమకు అందినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.
ఉమేష్ పాల్ హత్య కేసు నిందితుల్లో మొత్తం నలుగురు మృతి
తన తండ్రిని విడిపించడానికి అసద్ చేసిన ప్లాన్ భగ్నం చేయడానికి ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా సివిల్ పోలీసులు, ప్రత్యేక బలగాల బృందాలను మోహరించినట్లు యూపీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అసద్‌ను పట్టుకోవడానికి రెండు బృందాలను మోహరించినట్లు చెప్పారు. అసద్ తన సహచరుడు గులామ్‌తో కలిసి బైక్‌పై వెళుతుండగా అతన్ని అడ్డగించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో అసద్, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించినట్లు ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్‌ను మొత్తం స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. అసద్, గులామ్ మరణంతో ఉమేష్ పాల్ హత్య కేసుతో సంబంధం ఉన్న మొత్తం నలుగురులో పోలీసులు కాల్పుల్లో మరణించినట్లు అయ్యింది.
ఏప్రిల్ 12న అతిక్ అనుచరుడు గుడ్డు ముస్లిం కదలికలను పసిగట్టిన పోలీసులు
అతిక్ అనుచరుడు, ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన గుడ్డు ముస్లిం ఝాన్సీ హైకి సమీపంలోని అడవిలోని రహస్య ప్రదేశంలో ఉన్నట్లు ఎస్‌టీఎఫ్ తెలుసుకుంది. అంతేకాదు ఝాన్సీలోని పరిణామాలను ట్రాక్ చేస్తోందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి గుడ్డు ముస్లిం స్థావరం కిలోమీటరు దూరంలో ఉండటం గమనార్హం. అతిక్‌ను ప్రయాగ్‌రాజ్‌కు తీసుకెళ్లనున్న నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బృందం గుడ్డు ముస్లిం స్థావరంపై కన్నేసి ఉంచినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 12న, గుడ్డు ముస్లిం కార్యకలాపాలు కనిపించాయని, అందుకే తాము అప్రమత్తమై, హైవై నాలుగు బృందాలను మోహరించినట్లు చెప్పారు. తాము అనుకున్నట్లుగానే అసద్ ఎదురుపడం, ఎదురు కాల్పుల్లో అతను చనిపోవడం జరిగిందన్నారు.