Page Loader
గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్‌కౌంటర్‌ 
గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్‌కౌంటర్‌

గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్‌కౌంటర్‌ 

వ్రాసిన వారు Stalin
Apr 13, 2023
02:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కుమారుడు అసద్, అతని అనుచరుడు గులామ్ ఉత్తర్‌ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లోని ఉమేష్ పాల్ హత్య కేసులో అసద్, గులామ్ నిందితులుగా ఉన్నారు. వీరి ఇద్దరి పేరిట పోలీసులు ఐదు లక్షల రూపాయల రివార్డ్‌ను ప్రకటించారు. ఎన్‌కౌంటర్‌ అనంతరం అసద్, గులామ్ నుంచి విదేశీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డిప్యూటీ ఎస్పీలు నవేందు, విమల్ నేతృత్వంలోని యూపీఎస్‌టీఎఫ్ బృందంతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసద్ చనిపోయినట్లు వెల్లడించారు. అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని సీజేఎం కోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఝాన్సీలో జరిగిన ఎదురు కాల్పుల్లో అసద్ చనిపోయినట్లు పోలీసుల ప్రకటన

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అసద్, గులామ్ చనిపోయన దృశ్యాలు