Bridal groom Kidnaped-East Godavari: కంట్లోకారం కొట్టి పెళ్లికూతురును లాక్కెళ్లారు
పెళ్లిమండపంలో కూర్చున్న ఓ పెళ్లికూతురుకు కళ్లలో కారం కొట్టి కొంతమంది లాక్కెళ్లారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని తూర్పుగోదావరి జిల్లా(East Godavari Distirct)కడియం(Kadiyam)లో జరిగింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమండ్రి(Rajahmundry)రూరల్ కడియం లో పెళ్లి జరుగుతుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పెళ్లిమండపంలోకి వచ్చారు. ఆపై పెళ్లికూతురు కళ్లలో కారం కొట్టి ఆమెను ఎత్తకెళ్లబోయారు. పెళ్లికూతురు అడ్డుకోవడంతో ఇద్దరుముగ్గురు గట్టిగా పట్టుకుని లాక్కెళ్లబోయారు. పెళ్లికూతురు ప్రతిఘటించడంతో కింద పడిపోయిన ఆమెను అమానుషంగా ఈడ్చుకెళ్లారు. పెళ్లి కూతురు బంధువులు ఆ దుండగులనుంచి రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటననంతా వీడియో తీసి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అయ్యింది.
పెళ్లి కూతరు కిడ్నాప్ కు సంబంధించిన వైరల్ అవుతున్న వీడియో ఇదే
ముందు ఒప్పుకుని...తర్వాత ఇలా...
ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం గొడిగనూరు చెందిన గంగవరం స్నేహ, కడియంకు చెందిన బత్తిన వెంకటనందు ఓ కాలేజీలో వెటర్నరీ డిప్లొమా కలిసి చదివారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఉన్నస్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈనెల 13న విజయవాడలోని దుర్గగుడిలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంట కడియం వచ్చి వెంకటనందు ఇంట్లో చెప్పగా...పెద్దలు అంగీకరించారు. అయితే బంధువుల సమక్షంలో మరోసారి పెళ్లి చేసేందుకు ఈ నెల 21న ముహుర్తం నిర్ణయించారు. ఇదే విషయాన్ని వధువు స్నేహ తన తల్లిదండ్రులకు కూడా తెలిపింది. అప్పుడు ఓకే అన్న తల్లిదండ్రులు ఆదివారం తెల్లవారుజామున పద్మావతి, చరణ్ కుమార్, నక్కా భరత్, చందులతో కలసి వచ్చారు.
వ్యక్తికి గాయాలు...ఆస్పత్రికి తరలింపు
సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి వచ్చి అక్కడున్న వారిపై కారం చల్లి స్నేహను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో వెంకటనందు బంధువులు వారి ప్రయత్నాలను అడ్డుకోగా బత్తిన వీరబాబు అనే వ్యక్తి కి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.