తదుపరి వార్తా కథనం

BRS And BSP Alliance: పొత్తు ఖరారు.. బీఎస్పీకి రెండు ఎంపీ సీట్లు కేటాయించిన బీఆర్ఎస్
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 15, 2024
01:34 pm
ఈ వార్తాకథనం ఏంటి
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ, బీఎస్పీ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై కీలక నిర్ణయానికి వచ్చారు.
పొత్తు ఒప్పందంలో భాగంగా బీఎస్పీకి రెండు సీట్లు కేటాయిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన చేశారు.
ముఖ్యంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలను బీఎస్పీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేటాయించారు.
నాగర్ కర్నూలు బీఆర్ఎస్, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థిగా తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు.
పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి, హక్కులు కాపాడుకోవడానికి ఈ పొత్తు దోహదం చేస్తుందని బీఆర్ఎస్ , బీఎస్పీ అభిప్రాయపడింది.
మీరు పూర్తి చేశారు