
Supreme Court: సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. కోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీం కోర్టులో మరోసారి విచారణ కొనసాగుతోంది.
జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి వాదనలు వింటోంది.
ఈ నేపథ్యంలో, ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం వాదనలు వినిపించగా, అసెంబ్లీ సెక్రటరీ తరఫున ముకుల్ రోహత్గీ తన వాదనలు సమర్పిస్తున్నారు.
కేసు విచారణలో, సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన డివిజన్ బెంచ్ నిర్ణయం సరైనదేనని న్యాయవాదులు పేర్కొన్నారు. హైకోర్టు సింగిల్ బెంచ్ స్పీకర్‌కు గడువు విధించిన తీర్పు సరికాదని వాదనలు వినిపించారు.
వివరాలు
బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు
ఇప్పటికే స్పీకర్ నిర్ణయంలో హైకోర్టు జోక్యం చేసుకోవడం అభ్యంతరంగా ఉందని సూచించగా, ఈ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
"పార్టీ ఫిరాయింపుల అంశంపై కోర్టులు ఇక చేతులు కట్టుకుని కూర్చోవాలా?" అని ప్రశ్నించారు.
అంతేకాక, గతంలో కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కోర్టులో నిలబెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. "రాజ్యాంగంలో షెడ్యూల్-10 ఉండగా, ఫిరాయింపుల విషయంలో ఎలాంటి చర్య తీసుకోకపోతే, అది రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లే" అని జస్టిస్ బీఆర్ గవాయి అన్నారు.