Page Loader
Maganti Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత

Maganti Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) మరణించారు. జూన్ 5న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటినుంచి చికిత్స పొందుతూ, ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయం వైద్యులు అధికారికంగా ప్రకటించారు. అదే రోజు ఆయన ఇంట్లో ఉన్న సమయంలో ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది. వైద్యులు పరిశీలనలో ఆయన కార్డియాక్ అరెస్ట్‌కి గురయ్యారని తెలిపారు. వెంటనే సీపీఆర్ ఇచ్చి గుండె స్పందనను పునరుద్ధరించారు. నాడిస్థాయి, రక్తపోటు స్థిరపడడంతో వెంటిలేటర్‌పై ఐసీయూలో చికిత్స కొనసాగించారు. కొంతకాలంగా గోపీనాథ్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు.

Details

గుండెపోటుతో మృతి

మూడు నెలల క్రితమూ ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అప్పట్లో డయాలసిస్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుండెపోటు మరింత ప్రమాదంగా మారి ఆయన మృతికి దారితీసింది. 1982లో తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీలో మాగంటి గోపీనాథ్ చేరారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించారు. 2014లో తొలిసారిగా టీడీపీ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Details

పార్టీ ప్రముఖుల సంతాపం

అనంతరం 2018లో భారత రాష్ట్ర సమితిలో చేరి మరోసారి విజయం సాధించారు. తాజాగా 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి వరుసగా మూడవసారి ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఇక 2022లో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించారు. రాజకీయ జీవితం మొత్తం ప్రజలతో మమేకమై పనిచేయడానికే అంకితం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణం తెలంగాణ రాజకీయవర్గాల్లో విషాదాన్ని నింపింది. ఆయన సేవలను, ప్రజలతో ఆయన మమేకతను స్మరించుకుంటూ పలువురు నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు.