LOADING...
Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు ఆక్రమణ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై  కేసు నమోదు
దుర్గం చెరువు ఆక్రమణ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై  కేసు నమోదు

Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు ఆక్రమణ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై  కేసు నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2026
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో దుర్గం చెరువు భూమి ఆక్రమణకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి,వెంకట్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైడ్రా అధికారుల ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, దుర్గం చెరువు పరిధిలో సుమారు ఐదు ఎకరాల భూభాగం అక్రమంగా కబ్జా అయ్యినట్లు గుర్తించారు. చెరువు ప్రాంతాన్ని మట్టి, రాళ్లతో నింపి, అనంతరం ఆ భూభాగాన్ని STS ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీకి పార్కింగ్ కోసం అద్దెకు ఇచ్చారని హైడ్రా అధికారులు ఆరోపించారు. అటువంటి ఆక్రమణ ద్వారా ప్రభుత్వ భూభాగం నుండి నిందితులు లబ్ధి పొందుతున్నారని కూడా ఫిర్యాదు లో పేర్కొన్నారు.

వివరాలు 

హైడ్రా సూపర్వైజర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు

వాస్తవానికి, 2014లో HMDA (హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి సంస్థ) దుర్గం చెరువు FTL పరిధిపై ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, ఆ నోటిఫికేషన్ ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆక్రమణలు కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆక్రమణలపై హైడ్రా సూపర్వైజర్ క్రాంతి ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాదాపూర్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. కేసు నంబర్ నమోదు చేసుకుని, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి పై BNS చట్టం సెక్షన్ 329(3), 3(5) మరియు PDPP Act సెక్షన్ 3 కింద దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement