తదుపరి వార్తా కథనం

MLC Kavitha: కవితకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
వ్రాసిన వారు
Sirish Praharaju
Aug 22, 2024
01:15 pm
ఈ వార్తాకథనం ఏంటి
తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు కాసేపటి క్రితం ఢిల్లీ ఎయిమ్స్ కు తీసుకెళ్లారు.
వైరల్ ఫీవర్,గైనిక్ సమస్యలతో బాధ పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని జైలు అధికారులు తెలిపారు.
ఇంతకముందు కూడా ఓసారి కవిత అస్వస్థతకు గురయ్యారు. జులై 16న ఆమెను దీన్‌దయాళ్ అసుపత్రికి తరలించారు.అప్పుడు ఆమె తీవ్ర జ్వరం ,నీరసంతో బాధపడ్డారు.
కోలుకున్న తర్వాత కవితను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో మనీలాండరిగ్ నేరారోపణలతో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత దాదాపు 5 నెలలగా జైలులో ఉన్నారు. కవితపై సీబీఐ,ఈడీలు వేర్వేరు కేసులు నమోదు చేశాయి.