
MLC Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీలో మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితకు మరో సారి నిరాశ ఎదురైంది.
సీబీఐ కేసులో ఆమె బెయిల్‌పై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు తీర్పును మే 2కు రిజర్వ్ చేసింది.
కాగా, మద్యం కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో కోర్టు ఏప్రిల్ 15న అదుపులోకి తీసుకోగా, సీబీఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది.
దీంతో ఆమె రెండు బెయిల్ పిటషన్లు వేశారు.ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అవినీతి జరిగిందని సీబీఐ విచారణ చేస్తుండగా,మనీలాండరింగ్ కోణంపై ఈడీ విచారణ జరుపుతోంది.
కవిత బెయిల్
అరెస్ట్‌కు సరైన కారణాలు లేవు
కవిత బెయిల్ పిటిషన్‌పై ఆమె తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు.
కవిత అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదని , ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని కోర్టుకి తెలిపారు.
ఈడీ కస్టడీలో ఉన్నా.. సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసిందని, అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేదని అన్నారు.
పార్టీకి స్టార్ క్యాంపైనర్. ప్రతిపక్షంలో ఉన్నాం.. రూలింగ్ లో ఉన్నపుడే, ఏం చెయ్యలేక పోయాం. చిదంబరం జడ్జిమెంట్ కవిత విషయంలో సరిపోతుంది.
ఏడేళ్ల లోపల పడే శిక్ష ఆధారాలకు అరెస్ట్ అవసరం లేదు. అరెస్ట్‌కు సరైన కారణాలు లేవు." కవిత తరపున వాదనలు వినిపించారు.
సీబీఐ
బెయిల్‌ను వ్యతిరేకించిన సీబీఐ
ఇప్పుడు కవితను ఏజెన్సీ కస్టడీలో ఉంచి విచారించాల్సిన అవసరం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది.
కేసు విషయమై అడిగిన ప్రశ్నలకు కవిత సంతృప్తికరమైన సమాధానాలు చెప్పలేదని సీబీఐ కోర్టుకు తెలిపింది.
ఆమె నిజం చెప్పలేదని, తనను అడిగిన చాలా ప్రశ్నలకు అస్పష్టమైన సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారని సీబీఐ కోర్టుకు తెలిపింది.
విచారణలో సీబీఐ సేకరించిన మౌఖిక, డాక్యుమెంటరీ ఆధారాలకు వారి సమాధానాలు విరుద్ధంగా ఉన్నాయి.
ఆమె ప్రముఖ రాజకీయ నాయకురాలు, ప్రభావవంతమైన వ్యక్తి అని ఏజెన్సీ పేర్కొంది.
ఆమె సాక్షులను ప్రభావితం చేస్తుందని, సాక్ష్యాలను తారుమారు చేస్తుందని నమ్మడానికి బలమైన కారణాలు ఉన్నాయి, అవి ఇంకా సేకరించలేదని, ఆమె కేసు విచారణకు కూడా హాని కలిగించవచ్చని తెలిపారు.