LOADING...
Pasnoori dayakar: బీఆర్‌ఎస్ కు షాక్..కాంగ్రెస్ లోకి వరంగల్ ఎంపీ పసునూరి 
బీఆర్‌ఎస్ కు షాక్..కాంగ్రెస్ లోకి వరంగల్ ఎంపీ పసునూరి

Pasnoori dayakar: బీఆర్‌ఎస్ కు షాక్..కాంగ్రెస్ లోకి వరంగల్ ఎంపీ పసునూరి 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 15, 2024
05:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ,పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో భేటీ అయ్యారు. కడియం కావ్యకు వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇవ్వడంతో బీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఎంపీ దయాకర్‌ ఉన్నట్లు సమాచారం. వరంగల్‌లో మాదిగ సామాజికవర్గానికి జరిగిన అన్యాయంపై కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. గత రెండు నెలలుగా బిబి పాటిల్,పి.రాములు వంటి పార్లమెంటు సభ్యులు బిఆర్‌ఎస్‌ను విడిచిపెట్టి బిజెపిలో చేరారు. జహీరాబాద్‌ నియోజకవర్గం నుంచి బీబీ పాటిల్‌ బీజేపీ టికెట్‌పై పోటీచేస్తుండగా,రాములు కుమారుడు భరత్‌ నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో అయన బీఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమనే చర్చ జరుగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రేవంత్ రెడ్డిని కలిసిన వరంగల్ ఎంపీ