తదుపరి వార్తా కథనం
Bhuvanagiri: భువనగిరిలో బీఆర్ఎస్ కార్యాలయం ధ్వంసం.. కాంగ్రెస్ శ్రేణుల నిరసన
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 11, 2025
04:45 pm
ఈ వార్తాకథనం ఏంటి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ భువనగిరిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఈ అంశంపై భువనగిరిలోని బీఆర్ కార్యాలయంపై దాడి చేశారు.
కంచెల రామకృష్ణారెడ్డి శనివారం భువనగిరిలో మీడియాతో మాట్లాడినప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు.
Details
కిటికిలను ధ్వసం చేసిన కాంగ్రెస్ నాయకులు
రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనైతికమని యువజన కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో, ఆగ్రహంతో కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు.
అనంతరం కార్యాలయం ముందు బైటాయించి నిరసన తెలిపారు.