
MLC Kavitha Suspension: ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు.. ప్రకటన విడుదల చేసిన పార్టీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత రాష్ట్ర సమితి (BRS) ఒక కీలక నిర్ణయం ప్రకటించింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (Kavitha) పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అధికారికంగా వెల్లడించింది. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌పై కవిత చేసిన వ్యాఖ్యల కారణంగానే ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. దీనిపై పార్టీ తరఫున ప్రత్యేక ప్రకటన విడుదలైంది.''ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు భారత రాష్ట్ర సమితికి నష్టం కలిగించేలా ఉన్నాయి. అధిష్ఠానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు'' అని పార్టీ విడుదల చేసిన లేఖలో పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు
Official
— M9 NEWS (@M9News_) September 2, 2025
Kalvakuntla Kavitha suspended from the BRS Party for anti-party activities.#KavithaKalvakuntla pic.twitter.com/0FNpUVRfxA