కవితపై బండి సంజయ్ కామంట్స్; దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసస్తూ బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. శనివారం దిల్లీలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, మద్దతుదారులు సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దిల్లీ మద్య కుంభకోణంలో కవిత వికెట్ పడిపోయిందని, అతి త్వరలో మరికొంతమంది క్లీన్ బౌల్డ్ అవుతారని, మద్యం కుంభకోణం, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రశ్నే లేదని బండి సంజయ్ అన్నారు. కవితను అరెస్టు చేస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. 'అరెస్టు చేయకుంటే.. ముద్దు పెట్టుకుంటారా' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. శనివారం బీజేపీ ఆఫీస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.
విచారణను దారి మళ్లించడంలో ఇదొక ఎత్తుగడ: సంజయ్
'అరెస్టు చేయకుంటే.. ముద్దు పెట్టుకుంటారా' అని బండి సంజయ్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో ఆయన కార్యాలయం వివరణ ఇచ్చింది. తెలంగాణ మాండలికంలో ఇది సాధారంగా వినియోగించ పదబంధమని చెప్పుకొచ్చింది. ఎవరైనా నేరం చేస్తే, అభినందిస్తారా? లేదా శిక్షిస్తారా? అని అని ప్రకటనలో పేర్కొంది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కవిత విచారణను దారి మళ్లించడంలో ఇదొక ఎత్తుగడ అని చెప్పింది. బండి సంజయ్ బుధవారం కూడా దిల్లీ లిక్కర్ స్కామ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిల్లీ పాలకుల ముందు రాష్ట్ర ప్రజలు తలవంచరని కవిత చేసిన ప్రకటనపై మండిపడ్డారు. దిల్లీ మద్యం పాలసీ స్కామ్‌తో తెలంగాణ ప్రజలకు ఏమి సంబంధమని సంజయ్ ప్రశ్నించారు.