Page Loader
Srikakulam: శ్రీకాకుళంలో వైసీపీ నేత దారుణ హత్య!
శ్రీకాకుళంలో వైసీపీ నేత దారుణ హత్య!

Srikakulam: శ్రీకాకుళంలో వైసీపీ నేత దారుణ హత్య!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 11, 2025
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీకాకుళం జిల్లాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేట గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉప సర్పంచ్ సత్తారు గోపి దారుణ హత్యకు గురయ్యారు. కోయిరాల జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు అతనిపై రాడ్లు, కత్తులతో దాడి చేయడంతో గోపి అక్కడికక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో పడివున్న గోపి మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Details

భారీగా ట్రాఫిక్ జామ్

హత్యను నిరసిస్తూ గోపి బంధువులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. సత్తారు గోపి హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోపి, ఎంపీపీ మగతలవలస చిరంజీవికి అత్యంత సన్నిహితుడు అని సమాచారం. ఈ హత్యకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.