Page Loader
BSF: 2023లో పాకిస్థాన్ సరిహద్దులో 100 డ్రోన్‌లను కూల్చివేసిన బీఎస్ఎఫ్
BSF: 2023లో పాకిస్థాన్ సరిహద్దులోను 100 డ్రోన్‌లను కూల్చివేసిన బీఎస్ఎఫ్

BSF: 2023లో పాకిస్థాన్ సరిహద్దులో 100 డ్రోన్‌లను కూల్చివేసిన బీఎస్ఎఫ్

వ్రాసిన వారు Stalin
Dec 26, 2023
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌కు చెందిన డ్రగ్ ఆపరేటర్లు 2023లో డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలు, తుపాకీలను భారత భూభాగంలోకి పంపడానికి పంజాబ్ సరిహద్దులో తీవ్రమైన ప్రయత్నాలు చేసినట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF పేర్కొంది. పంజాబ్ సరిహద్దులో ఉద్రిక్తతలను సృష్టించడానికి, సామాజిక-ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేందుకు పాక్ పంపిన 100 కంటే ఎక్కువ డ్రోన్‌లను గుర్తించినట్లు వివరించింది. అందులో కొన్ని డ్రోన్లను బీఎస్ఎఫ్ కాల్చివేయగా.. మరికొన్నింటిని స్వాధీనం చేసుకుంది. అలాగే ఈ సంవత్సరం ఇప్పటివరకు పంజాబ్‌లో దాదాపు 500 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ పేర్కొంది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో హెరాయిన్ స్వాధీనం చేసుకోలేదని బీఎస్ఎఫ్ వెల్లడించింది.

డ్రోన్

వందల సంఖ్యలో మారణాయుధాలు స్వాధీనం

ఈ ఏడాది ఇప్పటి వరకు వందల సంఖ్యలో మారణాయుధాలు స్వాధీనం చేసుకోవడంతోపాటు పలువురు డ్రగ్స్‌ అక్రమ రవాణాదారులను కూడా బీఎస్ఎఫ్ అరెస్టు చేసింది. 2022లో 316 కిలోల హెరాయిన్‌ను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. పంజాబ్ రాష్ట్రంలో 190 డ్రోన్ చొరబాట్లను గుర్తించారు. 2021లో 485.165 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకోగా, 64 డ్రోన్ చొరబాట్లు నమోదయ్యాయి. మాదక ద్రవ్యాలు, డ్రోన్‌ల స్వాధీనంలో పెరుగుదలతో సరిహద్దు భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని BSF అధికారి ఒకరు తెలిపారు సరిహద్దులో డ్రగ్ డీలర్ల కార్యకలాపాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీఎస్ఎఫ్ ట్వీట్