Loading...
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు
ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు

AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2026
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా నేటి నుంచి సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. ఎల్లుండి నామినేషన్ల దాఖలుకు చివరి గడువు కాగా.. ఈ నెల 18న అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణకు కూడా గడువు కేటాయించారు.

వివరాలు

నామినేషన్ల షెడ్యూల్‌ ఇదీ..

ఈ నెల 19న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లను స్వీకరిస్తారు.

20వ తేదీన ఆ అప్పీళ్లను పరిష్కరిస్తారు. అనంతరం ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది.

అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.

వివరాలు

ఈ నెల 26న పోలింగ్‌.. అదే రోజు ఫలితాలు

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాల వెల్లడైన అనంతరం ఉపసర్పంచ్‌ ఎన్నిక నిర్వహించనున్నారు.

అవసరమైన చోట్ల 27న రీపోలింగ్‌

ఎన్నికల ప్రక్రియలో భాగంగా అవసరమైన ప్రాంతాల్లో ఈ నెల 27న రీపోలింగ్‌ చేపట్టనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్‌ నిర్వహిస్తారు.

అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది.

ADVERTISEMENT