Page Loader
Union Cabinet: ₹16,300 కోట్లతో నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌'కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర
₹16,300 కోట్లతో నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌'కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర

Union Cabinet: ₹16,300 కోట్లతో నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌'కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2025
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర క్యాబినెట్‌ పలు కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. క్రిటికల్‌ మినరల్స్‌ రంగంలో దేశం స్వయం సమృద్ధిని సాధించడానికి నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌ (NCMM)కి ఆమోదం తెలిపింది. ఈ మిషన్‌ కోసం రూ.16,300 కోట్ల వ్యయాన్ని కేటాయించి అమలు చేయనున్నారు. మన దేశం, ఆఫ్‌షోర్‌ ప్రాంతాల్లో కీలకమైన ఖనిజాల అన్వేషణను ప్రోత్సహించడం ఈ మిషన్‌ ప్రధాన లక్ష్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్‌ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియాతో పంచుకున్నారు.

వివరాలు 

ఇథనాల్‌ ధరను లీటర్‌కు రూ.56.28 నుండి రూ.57.97కు పెంపు 

ఈమిషన్‌ ముఖ్య ఉద్దేశ్యం అరుదైన ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, అలాగే ఈ రంగంలో దేశాన్ని స్వావలంబన వైపు నడిపించడమే. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలు కూడా అధిక ఖనిజ సంపత్తి ఉన్న దేశాలతో వ్యాపార సంబంధాలను మెరుగుపరచడం ద్వారా దేశీయంగా అరుదైన ఖనిజ నిల్వల అభివృద్ధికి తోడ్పడతాయని వైష్ణవ్‌ తెలిపారు. అదనంగా,సి హెచ్‌వీ మొలాసిస్‌ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌ ధరను లీటర్‌కు రూ.56.28 నుండి రూ.57.97కు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అయితే,బి హెవీ మొలాసిస్‌,చెరకు రసం/చక్కెర/చక్కెర సిరప్‌ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌ ధరల్లో ఎటువంటి మార్పులు చేయలేదని తెలిపారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ను మిళితం చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.