Page Loader
Union Cabinet: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా.. కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు
రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా.. కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు

Union Cabinet: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా.. కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2024
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంపునకు కృషి చేయడం లక్ష్యంగా, 'పీఎం అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌ (PM-AASHA)'కు రూ.35,000 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. రబీ పంట సీజన్‌ కోసం నాన్‌-యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల సబ్సిడీకి పచ్చజెండా ఊపింది. 2025-26 సంవత్సరానికి గాను గోధుమ సహా ఆరు పంటలకు కనీస మద్దతు ధర (MSP)ని పెంచడం జరిగింది. క్వింటాల్‌ గోధుమపై ఎంఎస్‌పీని తాజాగా రూ.150 పెంచడంతో, గతంలో రూ.2275గా ఉన్న కనీస మద్దతు ధర రూ.2425కి చేరినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

వివరాలు 

కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది. దీపావళి సందర్భంగా కరవు భత్యాన్ని (డీఏ - Dearness Allowance) 3% పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పెంపును ఈ ఏడాది జులై 1 నుంచి అమలు చేయనున్నారు. డీఏ పెంపుతో దాదాపు కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి కలగనుంది. సేకరణ ప్రకారం, క్వింటాల్‌కు ఆవాలుకు అత్యధికంగా రూ.300 పెంచగా, క్వింటాల్ పెసరకు రూ.275, శెనగలకు క్వింటాల్‌పై రూ.210, ప్రొద్దుతిరుగుడుకు రూ.140, బార్లీకి రూ.130 చొప్పున పెంచినట్లు సమాచారం అందింది. యూపీలోని వారణాసిలో గంగా నదిపై కొత్త రైల్వే కమ్ రోడ్డు వంతెన నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.2,642 కోట్లు వ్యయం చేయనుంది.