కెనడా ప్రధాని విమానం రెడీ.. మధ్యాహ్నం స్వదేశానికి ఎగరనున్న A-310 ఫ్లైట్
ఈ వార్తాకథనం ఏంటి
G-20 సదస్సు కోసం భారత్ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విమానం సాంకేతిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ మేరకు వారంతా భారతదేశంలోనే ఉండిపోయారు.
ఇండియాకు తరలివచ్చిన ప్రపంచ దేశాధినేతలు, ప్రతినిధులు ఇప్పటికే తమ దేశాలకు చేరుకున్నారు.
కెనడా ప్రధాన మంత్రితో పాటు ఉన్నతాధికారులు 1980 నాటి ఎయిర్‌బస్ A-310 విమానంలో జీ-20 సదస్సుకు వచ్చారు.
ట్రూడో, భారత్ నుంచి కెనడా వెళ్ళడానికి ఈ విమానానికి మరమ్మతులు చేపట్టారు. ఇవాళ మధ్యాహ్నాం ట్రూడో స్వదేశానికి పయనించనున్నట్లు కెనడా ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కెనడా ప్రధాని విమానం రెడీ
Canadian Prime Minister’s plane suffers technical snag | The technical issue with the plane has been resolved. The plane has been cleared to fly. The Canadian delegation is expected to depart this afternoon: Mohammad Hussain, Press Secretary of Canada PMO to ANI pic.twitter.com/dAtns784wa
— ANI (@ANI) September 12, 2023