
CM Revanth Reddy : మెట్రో, ఫార్మా సిటీ రద్దుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయట్లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు.
శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గించి, BHEL నుంచి ఎయిర్ పోర్టు వరకు 32 కిలోమీటర్ల వరకు వేస్తామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.
ఇక MHBS నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో ఉంటుందని పేర్కొన్నారు.
ఇక నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓఎస్ హాస్పిటల్ మీదుగా చంద్రయణ గుట్ట వద్ద ఎయిర్ పోర్ట్ వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేస్తామన్నారు.
Details
జనవరి 3న విస్తృత స్థాయి సమావేశం
అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రో పొడిగిస్తామని సీఎం చెప్పారు.
ఫార్మాసిటీ, రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రత్యేక కస్టర్ల వద్ద పరిశ్రమల్లో పనిచేసే వారికి ఇళ్ల నిర్మాణం కూడా చేపడుతామన్నారు.
వంద పడకల ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఉంటుందన్నారు.
జనవరి 3వ తేదీన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని, పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పుకొచ్చారు.