Page Loader
Nizamabad : టోల్‌ప్లాజా వద్ద లారీ బీభత్సం.. కారును ఢీకొన్న లారీ
టోల్‌ప్లాజా వద్ద లారీ బీభత్సం.. కారును ఢీకొన్న లారీ

Nizamabad : టోల్‌ప్లాజా వద్ద లారీ బీభత్సం.. కారును ఢీకొన్న లారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 26, 2023
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ ముందున్న కారును ఢీ కొట్టడంతో లారీ,కారు టోల్ ప్లాజా కౌంటర్ లోకి దూసుకెళ్లాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు, మరో ఇద్దరు టోల్ ప్లాజా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కౌంటర్‌లోకి దూసుకెళ్లిన లారీని క్రేన్‌ సాయంతో తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.