Page Loader
Hyderabad: బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం.. ఇద్దరికి గాయాలు 
Hyderabad: బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం.. ఇద్దరికి గాయాలు

Hyderabad: బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం.. ఇద్దరికి గాయాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 16, 2024
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని బేగంపేట ఫ్లై ఓవర్‌పై ఈరోజు(గురువారం)ఉదయం కారు బీభత్సం సృష్టించడంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. కారు పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. కారు అతివేగంతో నడుపుతూ ఫ్లైఓవర్‌పై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి ఆ తరువాత ట్రావెల్స్ బస్సును ఢీకొని రివర్స్ లో ప్లై ఓవర్ వాల్ కు కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో మహిళ, కారు డ్రైవర్‌ ఇద్దరికీ గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో బేగంపేట ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి ఇతర ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.