Page Loader
Nayanthara: 'రాముడిని అగౌరవపరిచినందుకు' నటి నయనతారపై కేసు నమోదు 
Nayanthara: 'రాముడిని అగౌరవపరిచినందుకు' నటి నయనతారపై కేసు నమోదు

Nayanthara: 'రాముడిని అగౌరవపరిచినందుకు' నటి నయనతారపై కేసు నమోదు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 11, 2024
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

అన్నపూరణి' సినిమాపై వివాదం రేగుతున్న నేపథ్యంలో నటి నయనతార, చిత్ర దర్శక, నిర్మాతలు, నెట్‌ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్‌పై కేసు నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఒక రైట్‌వింగ్ సంస్థ చేసిన ఫిర్యాదులో ఇటీవల విడుదలైన సినిమా 'అన్నపూరణి' సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని,రాముడిని అగౌరవపరిచారని, సినిమా ద్వారా 'లవ్ జిహాద్'ని ప్రచారం చేశారని ఆరోపించారు. నయనతార,దర్శకుడు నీలేష్ కృష్ణ,నిర్మాతలు జతిన్ సేథీ,ఆర్ రవీంద్రన్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ మోనికా షెర్గిల్ తో సహా ఏడుగురు నిందితుల పేర్లతో హిందూ సేవా పరిషత్ ఒంటి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.

Details 

సినిమాను తొలగించిన నెట్ ఫ్లిక్స్ OTT ప్లాట్‌ఫారమ్ 

డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా డిసెంబర్ 29 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. చివరికి, శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి ముంబై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో దిగివచ్చిన నెట్ ఫ్లిక్స్ OTT ప్లాట్‌ఫారమ్ సినిమాను తొలగించింది. నయనతార,ఇతరులపై మితవాద సంస్థలు బజరంగ్ దళ్, హిందూ ఐటీ సెల్ ముంబైలో రెండు ఫిర్యాదులు కూడా దాఖలు చేశాయి.