Page Loader
Padi Kaushik Reddy: హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
Padi Kaushik Reddy: హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

Padi Kaushik Reddy: హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

వ్రాసిన వారు Stalin
Dec 04, 2023
06:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించి.. పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. తాజాగా పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎన్నికల నియమావళిని కౌశిక్ రెడ్డి ఉల్లంఘించారని, అలాగే పోలీసుల విధులకు ఆటంకం కల్పించారని పోలీసులు అభియోగాలు మోపారు. కరీంనగర్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. అయితే ఆ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు గుమిగూడి ఉండటంతో ఎక్కువ మంది ఉండొద్దంటూ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు-కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఓట్ల లెక్కింపు సమయంలో పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదం