
Maharashtra: దారుణం.. అమెరికా మహిళను అడవిలో కట్టేసిన వైనం
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుసుకుంది.
అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్ అనే మహిళ(50) ను ఆమె భర్త అటవీ ప్రాంతంలో చెట్టుకు కట్టేసి వెళ్లారు.
ఆకలితో బాధపడుతూ నిరసించిపోయి బాధితురాలి ఏడుపులు విన్న గొర్రెల కాపరి ఒకరు పోలీసులకు సమాచారం ఇవ్వడం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే బాధితురాలిని కాపాడి ఆస్పత్రికి తరలించారు.
ఆమె వద్ద అమెరికా పాస్ పోర్టు, తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డు, మరికొన్ని డాక్యుమెంట్స్ దొరికాయి.
Details
హత్యాయత్నం కేసు నమోదు
ఆ మహిళను ఆమె భర్తే అటవీ ప్రాంతంలో కట్టేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
బాధితురాలి పరిస్థితిని చూసిన పోలీసులు ఆమె రెండ్రోజులగా ఆహారం తీసుకోలేదని, వాంగూల్మం ఇచ్చే పరిస్థితిలో కూడా లేదన్నారు.
అయితే 40 రోజులుగా తాను ఆహారం తీసుకోలేదని కాగితంపై బాధితురాలు రాసి చూపించిందని పోలీసులు చెప్పారు.
దీనిపై ఆమె భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.