Page Loader
Cash For Query : మహువా మోయిత్రా ప్రశ్నకు డబ్బు కేసులో నేడు లోక్‌సభ ప్యానెల్ విచారణ
Cash For Query : మోయిత్రా కేసులో నేడు లోక్‌సభ ప్యానెల్ విచారణ

Cash For Query : మహువా మోయిత్రా ప్రశ్నకు డబ్బు కేసులో నేడు లోక్‌సభ ప్యానెల్ విచారణ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 26, 2023
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ప్రశ్నకు డబ్బు కేసులో ఇవాళ లోక్‌సభ ప్యానెల్ విచారణ చేపట్టనుంది. ఈ మేరకు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరుకానున్నారు. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై ప్రశ్నకు డబ్బు ఆరోపణలపై తొలి సమావేశాన్ని నిర్వహించనుంది. సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్యానెల్ ముందు హాజరై, ఈ అంశంపై తన స్టేట్‌మెంట్‌ను ఇవ్వనున్నారు. దేహాద్రాయ్ తర్వాత, మోయిత్రాపై క్యాష్ ఫర్ క్వరీ లంచం లంచం ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మధ్యాహ్నం 12:30 గంటలకు కమిటీ ముందు హాజరుకానున్నారు.

DETAILS

లంచాల మార్పిడికి సంబంధించి తిరుగులేని సాక్ష్యాలున్నాయి : దూబే 

అంతకుముందు స్పీకర్ ఓం బిర్లాకు చేసిన ఫిర్యాదులో, దూబే దేహద్రాయ్ బహిర్గతం చేసిన పత్రాలను ఉదహరించారు. బీజేపీ ఎంపీ వినోద్‌కుమార్‌ సోంకర్‌ నేతృత్వంలోని కమిటీకి బిర్లా ఈ విషయాన్ని సూచించారు. గతంలో మొయిత్రాకు సన్నిహితంగా ఉన్న న్యాయవాది, మహిళా ఎంపీ- వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ మధ్య లంచాల మార్పిడికి సంబంధించి తిరుగులేని సాక్ష్యాలను పంచుకున్నారని దూబే వివరించారు. ఇదే సమయంలో బిర్లాకు దూబే రాసిన లేఖలో, మోయిత్రా అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు అదానీ గ్రూప్‌నకు చెందినవే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో అదానీ గ్రూప్ సహా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకునేందుకు టీఎంసీ ఎంపీ మోయిత్రా సభ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించారన్నారు.