Page Loader
AP Cabinet Decisions: రేపే రైతుల ఖాతాల్లోకి ధాన్యం నగదు.. చంద్రబాబు సర్కార్ నిర్ణయం
రేపే రైతుల ఖాతాల్లోకి ధాన్యం నగదు.. చంద్రబాబు సర్కార్ నిర్ణయం

AP Cabinet Decisions: రేపే రైతుల ఖాతాల్లోకి ధాన్యం నగదు.. చంద్రబాబు సర్కార్ నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 10, 2025
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి వెల్లడించారు. ముఖ్యంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలకు సంబంధించి భవనాలను త్వరితగతిన పూర్తిచేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది.

Details

అమరావతిలో నిర్మాణ పనులకు మేళవింపు 

మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేల నివాస భవనాల పూర్తి కోసం రూ. 524.7 కోట్ల పరిపాలన ఆమోదం 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 33.49 ఎకరాల భూముల కేటాయింపు కొత్తగా 7 సంస్థలకు 32.4 ఎకరాల భూమి కేటాయింపు గెయిల్, అంబికా సంస్థలకు కేటాయించిన భూముల రద్దు

Details

ప్రాజెక్టులు, పునరుద్ధరణలకు మద్దతు 

కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఇసుక క్వారీయింగ్‌కు రూ. 250.2 కోట్లు సీఆర్డీఏ ఆధ్వర్యంలో ఎన్‌జీటీ, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు క్వారీయింగ్ నిర్వహణకు ఆమోదం గత ప్రభుత్వం పక్కన పెట్టిన జలవనరుల శాఖకు చెందిన 71 పనులకు ఆమోదం కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం విమానాశ్రయాల అభివృద్ధికి హడ్కో నుంచి రూ. 1,000 కోట్లు రుణం విమానాశ్రయాల లీజింగ్ ద్వారా వచ్చిన ఆదాయంతో అప్పులు చెల్లించేందుకు ఆమోదం

Details

రైతులకు ఊరట, వ్యవసాయ రంగానికి ధీమా 

హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం జల్ జీవన్ మిషన్ ఏర్పాటుకు ఆమోదం; రూ. 10,000 కోట్ల రుణం ద్వారా నిధుల సమీకరణ గ్రీన్ ట్యాక్స్‌ను రూ. 1,500-3,000కి తగ్గిస్తూ రవాణాశాఖ ప్రతిపాదనకు ఆమోదం తోతాపురి మామిడి 6.5 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ఆమోదం కిలోకు రూ. 4 చొప్పున రూ. 260 కోట్లు మంజూరు ధాన్యం కొనుగోలుకు రూ. 672 కోట్ల విడుదలకు ఆమోదం రేపు రైతుల ఖాతాల్లో ధాన్యం నగదు జమ చేయాలని నిర్ణయం

Details

రాజధాని నిర్మాణంపై స్పష్టత 

రెండో విడత భూ సమీకరణకు ప్రజలతో విస్తృత సంప్రదింపులు రైతుల అనుమానాలను నివృత్తి చేసిన తరువాతే భూసేకరణ చేపట్టాలని సీఎం ఆదేశం సాంకేతిక రంగానికి బలం అమరావతిలో క్వాంటం వ్యాలీ కంప్యూటింగ్ సెంటర్‌కు ఆమోదం రాష్ట్రంలో స్పేస్ టెక్నాలజీ అభివృద్ధికి పాలసీకి ఆమోదం రామాయపట్నంలో భూసేకరణ కోసం 5 టీంల ఏర్పాటు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన 1575 పింఛన్ల పునరుద్ధరణకు ఆమోదం మార్క్ ఫెడ్ తీసుకున్న రూ. 6,700 కోట్ల రుణానికి అదనంగా రూ. 1,000 కోట్లు రుణం పొందేందుకు అనుమతి

Details

వైసీపీ కుట్రలపై మండిపడ్డ సీఎం

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాల్సిన సమయంలో పెట్టుబడులు రాకుండా చేసేందుకు కుట్రలు పన్నడం సిగ్గుచేటన్నారు. సీపీఐకి చెందిన ఉదయ భాస్కర్ వంటి ప్రముఖులు పెట్టుబడులు పెట్టవద్దని వైసీపీ నేతలు మెయిల్స్ పంపించారని ఆరోపించారు. పరిశ్రమలను అడ్డుకునే ఈ దిగజారుడు రాజకీయాలకు రాష్ట్రంలో స్థానం ఉండదని స్పష్టం చేసిన సీఎం, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మంత్రులపై ఉందన్నారు. పారిశ్రామిక ప్రగతికి మార్గం సుగమం చేసేందుకు అంతా సమిష్టిగా కృషి చేయాలని కేబినెట్‌కు సూచించారు.