Chhattisgarh Congress Manifesto: రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివే
ఈ వార్తాకథనం ఏంటి
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌కు సంబంధించిన మేనిఫెస్టోను ఆదివారం కాంగ్రెస్ విడుదల చేసింది.
కాంగ్రెస్ మేనిఫెస్టోను రాజ్‌నంద్‌గావ్‌లో సీఎం భూపేష్ బఘెల్ విడుదల చేశారు. కుల గణన, వ్యవసాయ రుణాల మాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి హామీలు మేనిఫెస్టోలో ఉన్నాయి.
మేనిఫెస్టోకు 'పార్టీ మేనిఫెస్టో ఆఫ్ ట్రస్ట్' అని పేరు పెట్టింది. ఇందులో రైతులు, యువత, మహిళలపై దృష్టి సారించారు.
దీంతో పాటు ఇతర నేతలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మేనిఫెస్టోలను విడుదల చేశారు. రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టోను రాష్ట్ర ఇన్‌ఛార్జ్ కుమారి సెల్జా రిలీజ్ చేశారు.
కాంగ్రెస్
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని కీలక హామీలు
వరి పంటకు రూ.3200 మద్దతు ధర
కుల గణన
ఎకరాకు 20 క్వింటాళ్ల వరి కొనుగోలు
200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
పీజీ వరకు ఉచిత విద్య
రుణమాఫీ
పరిశ్రమలు స్థాపించడానికి యువతకు 50% వరకు సబ్సిడీ రుణాలు
రూ. 500కి గ్యాస్ సిలిండర్
భూమిలేని కూలీలకు సంవత్సరానికి 10వేల సాయం
పేదల కోసం 17.50 లక్షల ఇళ్ల నిర్మాణం
రూ. 10 లక్షల వరకు ఉచిత చికిత్స
ప్రమాదాలకు ఉచిత చికిత్స
రవాణా వ్యాపారుల పన్ను, రుణ మాఫీ
అన్ని ప్రభుత్వ పాఠశాలలు స్వామి ఆత్మానంద పాఠశాలలుగా తీర్చిదిద్దడం
స్వయం సహాయక సంఘాల రుణమాఫీ
అంత్యక్రియలకు ఉచిత కలప రాజీవ్ గాంధీ భూహిన్‌ను 7 వేల నుంచి 10 వేలకు పెంపు