
Caste survey: కేంద్రం కీలక నిర్ణయం..తదుపరి జనాభా లెక్కల్లో కుల గణన
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.రాబోయే జనాభా లెక్కలలో కులగణనను చేర్చాలని ప్రకటించింది.
ఈ మేరకు బుధవారం కేంద్రం క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
ఈ ప్రకటనలో ఆయన, జనాభా లెక్కలతో పాటు కుల గణనను కూడా చేర్చాలని క్యాబినెట్ నిర్ణయించిందని తెలిపారు.
కొన్ని రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాల కోసం "కులగణన" నిర్వహించాయని,ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాబోయే జనాభా లెక్కలతో పాటు కుల గణన కూడా చేయాలని నిర్ణయించిందని ఆయన తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల సమయం నుండి,కాంగ్రెస్ పార్టీ సహా ఇతర రాజకీయ కూటమి నేతలు కుల గణన నిర్వహించాలన్న డిమాండ్ చేస్తున్నారు.
వివరాలు
రాజకీయ పార్టీలు కుల గణనను సమర్థించాయి: అశ్విని వైష్ణవ్
కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కులగణన నిర్వహిస్తామని హామీ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో,కాంగ్రెస్ పాలిత తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాలు,అలాగే ఎన్డీయే పాలిత బీహార్ రాష్ట్రం కులగణన నిర్వహించాయి.
జాతీయ జనాభా లెక్కలలో కుల గణనను చేర్చడంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, "కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎల్లప్పుడూ కుల గణనను వ్యతిరేకించేవి. 2010లో, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కుల గణనపై చర్చ జరిపే అంశాన్ని స్వీకరించింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి ఒక మంత్రివర్గ బృందం ఏర్పడింది. పలు రాజకీయ పార్టీలు కుల గణనను సమర్థించాయి" అని తెలిపారు.
వివరాలు
చెక్కర ధరకు సంబంధించి కీలక ప్రకటన
కేంద్ర మంత్రివర్గం,కొన్ని రాష్ట్రాలు కుల గణనను సరిగ్గా నిర్వహించాయని,అయితే మరికొన్ని రాష్ట్రాలు పారదర్శకత లేకుండా,కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం సర్వేలు నిర్వహించాయని ఆరోపించారు.
ఈ విధమైన సర్వేల వల్ల సమాజంలో సందేహాలు నెలకొంటాయని ఆయన పేర్కొన్నారు.
మన సామాజిక నిర్మాణం రాజకీయ ప్రభావం నుండి దూరంగా ఉండాలని,అందుకే కుల గణనను జాతీయ జనాభా లెక్కలలో చేర్చామని కేంద్రమంత్రి వివరించారు.
ఇంకా,కేంద్రమంత్రి చెక్కర ధరకు సంబంధించి కూడా కీలక ప్రకటన చేశారు. 2025-26 చక్కర సీజన్‌లో చెరకుకు క్వింటాల్‌కు రూ.355 కనీస ధరగా నిర్ణయించారని, ఇది బెంచ్‌మార్క్ ధరగా పరిగణించబడుతుందని తెలిపారు.
అలాగే,షిల్లాంగ్ నుండి సిల్చార్ వరకు రూ.22,864 కోట్ల వ్యయంతో హై స్పీడ్ కారిడార్ హైవే నిర్మాణానికి కేంద్రమంత్రివర్గం ఆమోదం ఇచ్చిందని వెల్లడించారు.