Delhi: DPCC సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ.. 2.39 కోట్ల నగదు స్వాధీనం
అవినీతి కేసులో ఇద్దరు నిందితులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. వీరిలో ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీకి చెందిన సీనియర్ పర్యావరణ ఇంజనీర్, ఒక ప్రైవేట్ వ్యక్తి ఉన్నారు. వీరు 91,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ వద్ద నుంచి రూ.2.39 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ తెలిపింది.అవినీతిపై సీబీఐ జీరో టాలరెన్స్ పాలసీ కింద ఈ చర్య తీసుకున్నారు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ),సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్,ఢిల్లీతోపాటు నలుగురు ప్రైవేట్ వ్యక్తులపై సీబీఐ ఆదివారం కేసు నమోదు చేసింది. సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ప్రైవేట్ సంస్థల ప్రతినిధుల నుంచి లంచం తీసుకుని అక్రమంగా లబ్ధి పొందినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇంజనీర్‌తో సహా ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
లంచం తీసుకుంటూ మధ్యవర్తి కొడుకు అరెస్ట్
అవినీతి కేసులో 6 మంది నిందితులపై సీబీఐ చర్యలు తీసుకోగా,వారిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ నిందితులు ప్రైవేట్ సంస్థల ప్రతినిధుల నుంచి లంచాలు తీసుకుని అక్రమంగా లబ్ధిపొందినట్లు ఆరోపణలున్నాయి. 91,500 లంచంతో సీనియర్ పర్యావరణ ఇంజనీరు, మధ్యవర్తి కొడుకును సీబీఐ వల వేసి పట్టుకుంది. నిందితుల ఇళ్లపై దాడులు నిర్వహించి, సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ఆవరణలో రూ.2.39 కోట్ల నగదు (సుమారు) కొన్ని ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.