Page Loader
లాలూ కేసు విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. బెయిల్‌పై సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ
బెయిల్‌పై సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ

లాలూ కేసు విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. బెయిల్‌పై సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 18, 2023
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు దాణా కుంభకోణం కేసులో మళ్లీ షాక్ తగిలింది. బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు 25న విచారణ చేపట్టనుంది. దాణా కుంభకోణం కేసుల్లో జైలు శిక్ష పడిన లాలూ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. కిడ్నీ సమస్య కారణంగా ఝార్ఖండ్‌ హైకోర్టు ఆయనకు బెయిల్‌ ఇచ్చింది. గత డిసెంబరులో సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. క్రమంగా కోలుకుని ఇండియా కూటమి సమావేశాలకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన బెయిల్‌ను సవాల్‌ చేస్తూ సీబీఐ సుప్రీంకు వెళ్లడం కొసమెరుపు. 1991- 1996 మధ్యలో లాలూ హయాంలో దశలవారీగా రూ.950 కోట్ల మేర దాణా కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాజీ సీఎం లాలుకు సీబీఐ షాక్