Land-for-jobs scam: లాలూతో పాటు కుటుంబ సభ్యుల రూ.6 కోట్ల ఆస్తులు జప్తు
ఈ వార్తాకథనం ఏంటి
ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌లకు చెందిన 6 కోట్ల విలువైల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం జప్తు చేసింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ప్రకారం ఆస్తులను అటాచ్ చేసేందుకు ఏజెన్సీ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.
కొన్ని ఏళ్లుగా ఈడీ ఈ కేసును విచారిస్తోంది. ఇటీవల లాలూతో పాటు కుటంబ సభ్యుల వాంగ్మూలాలను కూడా ఈడీ రికార్డు చేసింది.
జప్తు చేసిన వాటిలో దిల్లీ, బిహార్‌లోని ఆస్తులు, న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని నివాస గృహం ఉన్నట్లు తెలుస్తోంది.
బిహార్
లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు స్కామ్
యూపీఏ-1(2004-09) ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ జరిగినట్లు ఈడీ అభియోగాలు మోపింది.
ఈ కేసులో నాలుగేళ్ల పాటు విచారణ జరిపి, పలువురు నిందితులను విచారించిన తర్వాత ఈడీ ఈ చర్యలు తీసుకున్నది.
ఈ కేసులో లాలూతో పాటు, ఆయన భార్య రబ్రీ దేవి, వారి కుమార్తెకు దిల్లీ కోర్టు మార్చి 15న బెయిల్ మంజూరు చేసింది.
అదే నెలలో దిల్లీలోని తేజస్వి నివాసం, జాతీయ రాజధాని ప్రాంతం, ముంబై, రాంచీ, పాట్నా, బిహార్‌లోని ఇతర సైట్‌లతో సహా వివిధ ప్రదేశాలలో ఈడీ దాడులు నిర్వహించింది.
ఈ స్కామ్‌లో నిందితులుగా లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, కుమార్తె ఉన్నారు.