Page Loader
Census of India: 2025లో జనగణన..  2028లో లోక్‌సభ స్థానాల పునర్విభజన! 
Census of India: 2025లో జనగణన..  2028లో లోక్‌సభ స్థానాల పునర్విభజన!

Census of India: 2025లో జనగణన..  2028లో లోక్‌సభ స్థానాల పునర్విభజన! 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2024
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

జనగణన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం అందింది. వచ్చే ఏడాదిలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత లోక్‌సభ స్థానాల విభజన ప్రారంభమవుతుందని, అది 2028కి ముగుస్తుందని తెలిపారు. ప్రతి పది సంవత్సరాలకోసారి నిర్వహించాల్సిన జనగణన మూడేళ్లుగా వాయిదా పడుతూ ఉంది. రాష్ట్రాలవారీగా, జాతీయ స్థాయిలో వివిధ అభివృద్ధి పథకాలు,సంక్షేమ కార్యక్రమాలను రూపొందించడానికి ఈ జనగణన కీలకమైంది. 2021 లో కొవిడ్ సంక్షోభం ఈ ప్రక్రియకు ప్రతిబంధకంగా మారింది, దాని తర్వాత ఇది వాయిదా పడింది.

వివరాలు 

ఏప్రిల్‌లో చైనాను అధిగమించిన భారతదేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కొద్దిరోజుల క్రితం మాట్లాడుతూ, ''తగిన సమయంలో ఈ ప్రక్రియను నిర్వహిస్తాం. దీనిపై నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఎలా జరుగుతుందో నేను ప్రకటిస్తాను. ఈసారి పూర్తిగా డిజిటల్‌లో ఈ సర్వే ఉంటుంది'' అని తెలిపారు. ఐక్యరాజ్య సమితి ప్రకటించినట్లు, ఏప్రిల్‌లో చైనాను అధిగమించి భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. ప్రస్తుతం చైనా జనాభా 142 కోట్ల కన్నా భారతీయ జనాభా రెండు కోట్లు అధికమని ఒక అంచనా ఉంది, కానీ కచ్చితమైన లెక్కలు లేవు. వేర్వేరు పథకాలకు సంబంధించి 2011 నాటి గణాంకాల ఆధారంగా లక్ష్యాలు, వ్యయ అంచనాలు రూపొందిస్తున్నారు.

వివరాలు 

25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు: నీతి ఆయోగ్‌

తొమ్మిదేళ్ల వ్యవధిలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్‌ లెక్కలు తెలిపారు. సరైన గణాంకాలు లేకుండా ఈ ప్రకటన చేయడం పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జనగణన పూర్తికాకుండా నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ ఆగాల్సిందే. ఈ నేపథ్యంలో, కులగణన గురించి ప్రతిపక్షాల నుంచి తీవ్ర డిమాండ్లు రావడం జరిగింది. ఈ తరుణంలో, తాజా సమాచారం అందుబాటులో ఉంది, అయితే ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.