Page Loader
Amaravati: అమరావతి ప్రజలకు కేంద్రం శుభవార్త.. 14 లక్షల మంది లబ్ధి పొందేలా కొత్త ప్రాజెక్టు!
అమరావతి ప్రజలకు కేంద్రం శుభవార్త.. 14 లక్షల మంది లబ్ధి పొందేలా కొత్త ప్రాజెక్టు!

Amaravati: అమరావతి ప్రజలకు కేంద్రం శుభవార్త.. 14 లక్షల మంది లబ్ధి పొందేలా కొత్త ప్రాజెక్టు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2024
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొత్త రైల్వే లైన్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు వంటి ప్రాజెక్టులతో ముందుకెళ్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు మరో శుభవార్త అందించింది. ఈ అవకాశం దాదాపు 14 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది. ఏపీ రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వం 500 పడకల ఈఎస్‌ఐ సెకండరీ కేర్ ఆసుపత్రి, 150 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఈఎస్‌ఐ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి విభజన తర్వాత తెలంగాణకు చేరుకున్నందున, ఈ ఆసుపత్రిని అమరావతిలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.

Details

సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం

దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. జాతీయ వైద్య కమిషన్‌ నిబంధనల ప్రకారం, వైద్య కళాశాల కోసం 25 ఎకరాలు, ఈఎస్‌ఐసీ నిబంధనల ప్రకారం 500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 10 ఎకరాలు అవసరం. ఈ భూములను ఏపీ ప్రభుత్వం కేటాయించనుంది. ఈ ఆసుపత్రి నిర్మాణం, నిర్వహణ బాధ్యతను ఈఎస్‌ఐ కార్పొరేషన్‌కు అప్పగిస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారమూ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ బాధ్యతను స్వీకరిస్తే, ఒప్పందం ప్రకారం 1/8వ వంతు వ్యయం భరించాల్సి ఉంటుంది. అమరావతిలో ఆసుపత్రి, వైద్య కళాశాల ఏర్పాటు చేయడానికి అనేక కారణాలున్నాయి..

Details

రాష్ట్రవ్యాప్తంగా 14,55,987 మంది ఈఎస్‌ఐ ఉద్యోగులు

ఇప్పటికే అమరావతిని కలుపుతూ జాతీయ రహదారులు, రైలు మార్గాలు సాగిపోతున్నాయి. భవిష్యత్తులో ఐటీ కంపెనీలు, హోటళ్లు, విద్యా సంస్థలు, పరిశ్రమలు ఇవన్నీ అమరావతిలో రానున్న అవకాశాలుగా ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,55,987 మంది ఈఎస్‌ఐ ఉద్యోగులున్నారు. వారిలో 4 లక్షల మందికి పైగా విజయవాడ, గుంటూరు నగరాల్లో ఉంటారు. వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి