Page Loader
Hyderabad: ప్రాంతీయ రింగ్ రోడ్డుపై కేంద్రం ప్రత్యేక దృష్టి 
ప్రాంతీయ రింగ్ రోడ్డుపై కేంద్రం ప్రత్యేక దృష్టి

Hyderabad: ప్రాంతీయ రింగ్ రోడ్డుపై కేంద్రం ప్రత్యేక దృష్టి 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2024
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు అవతల నిర్మించే ప్రాంతీయ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) పై కేంద్ర ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యాచరణ 2047లో ఆర్ఆర్ఆర్ ను తాజాగా చేర్చింది. సూమారు 350కిలోమీటర్ల మేర ప్రాంతీయ రింగ్ రోడ్డును ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించాయి. మొదట ఉత్తర భాగాన్ని 161.52 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు అలైన్ మెంట్ ను అమోదించింది.

Details

భూ సేకరణ పూర్తియైన వెంటనే పనులు ప్రారంభం

ఇక దీనికి జాతీయ హోదాను సైతం కేంద్రం కేటాయించింది. రెండో విడతలో 189.20 కిలోమీటర్ల దక్షిణ భాగాన్ని నిర్మించేందుకు మార్గాన్ని రూపొందించారు. రెండు భాగాల రహదారి నిర్మాణానికి సుమారు రూ.27 వేల కోట్ల ఖర్చు కానుంది. భూ సేకరణ ప్రక్రియ పూర్తియైన వెంటనే పనులు చేపడుతామని ఇటీవల కేంద్రమంద్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. రానున్న మూడు నెలల్లో భూ సేకరణ పనులు పూర్తి కానున్నాయి. ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ చివరి దశలో ఉండగా, దక్షిణ భాగం రహదారిలో భూములు కోల్పోయే రైతులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంది.