
MIB: కేంద్రం మీడియాకు హెచ్చరిక.. రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ప్రస్తావించవద్దు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంతో మిలిటరీ కార్యకలాపాలకు సంబంధించిన మీడియా కవరేజ్‌పై భారత ప్రభుత్వ శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
నాలుగు రోజుల నుంచి భారత్, పాకిస్తాన్ మీడియా ఛానెళ్లలో ఈ అంశం ప్రధానంగా చర్చనీయాంశమైంది.
భారత మీడియా, మిలిటరీ కార్యకలాపాలు, యుద్ధ సంబంధిత సమాచారం ప్రతీక్షణం అందజేస్తోంది. ఈ నేపథ్యంలో, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) దేశీయ మీడియా ఛానెల్స్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా యూజర్లకు కీలక అడ్వైజరీ జారీ చేసింది.
జాతీయ భద్రత అంశానికి సంబంధించిన సున్నితమైన కార్యాచరణల వివరాలను రక్షించడం అవసరం అని కేంద్రం స్పష్టం చేసింది.
Details
మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి
జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా సంస్థలు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు తమ బాధ్యతను సమగ్రంగా తీసుకుని మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించిందని మంత్రిత్వ శాఖ రెండు పేజీల లేఖలో పేర్కొంది.
ప్రత్యేకంగా, రక్షణ సంబంధిత కార్యకలాపాలు లేదా కదలికలు గురించి 'సోర్స్ బేస్డ్' సమాచారం ఆధారంగా రియల్-టైమ్ కవరేజ్, విజువల్స్ పంచుకోవడం లేదని కేంద్రం తెలిపింది.
సున్నితమైన సమాచారం ముందుగానే బయటపడటం అనుకోకుండా శత్రు శక్తులకు సహాయం చేసి, ఆపరేషన్స్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉందని, సిబ్బంది భద్రతకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది.