Medicine : 156 ఔషధాలపై బ్యాన్ విధించిన కేంద్రం
రోగులకు ముప్పు వాటిల్లే 150 రకాల ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది. వీటిలో ప్రధానంగా జ్వరం, జలుబు, నొప్పులు, అలర్జీల మందులను వాడుతుంటారు. స్థిర మోతాదులో రెండు, అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషద పదార్థాలను కలిపి వాడే మందులను కాక్ టెయిల్ డ్రగ్స్ అని కూడా వ్యవహరిస్తారు. నిషేధిత మందుల జాబితాలో . ఎసెక్లోఫెనాక్ 500 ఎంజీ + పారాసెటమాల్ 125 ఎంజీ మాత్రలను, మెఫెనమిక్ యాసిడ్ + పారాసెటమాల్ ఇంజెక్షన్, సెట్రిజెన్ హెచ్‌సీఎల్+ పారాసెటమాల్+ ఫినైలెప్రైన్ హెచ్‌సీఎల్, లెవొసెట్రిజిన్+ ఫినైలెప్రైన్ హెచ్‌సీఎల్+ పారాసెటమాల్ వంటివి ఉన్నాయి. ఈ మేరకు ఈనెల 12న నోటిఫికేషన్ కూడా విడుదలైంది.