ఎన్నికల కమీషనర్లను ఎన్నుకునే ప్యానెల్ నుండి ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో సరికొత్త బిల్లును ప్రవేశ పెట్టనుంది. ఇకపై ఎన్నికల కమీషనర్లను నియమించే ప్యానెల్ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలని బిల్లుకు తీసుకువస్తున్నారు. కొత్తగా తీసుకువచ్చే బిల్లు ప్రకారం. ఎలక్షన్ కమీషనర్లను ఎన్నుకునే సమూహంలో భారత ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధానమంతి ఎన్నుకున్న మంత్రి మండలి సభ్యుడు ఉంటారు. ఎన్నికల కమిషనర్లను, ఎన్నికల ఆఫీసర్లను ఎన్నుకునే సమూహం నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలని బిల్లును తీసుకువస్తున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.
బిల్లును ఖండించిన కాంగ్రెస్
రాజ్యాంగ బద్ధమైన స్వతంత్ర వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఇలాంటి కొత్త బిల్లును తీసుకొస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుష్మిత దేవ్ అన్నారు. స్వతంత్ర వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకోవడానికి కొత్త బిల్లును తీసుకువస్తున్నారని సుష్మితా దేవ్ మాట్లాడారు. ఈ సంవత్సరం మార్చ్ నెలలో ఐదుగురు సభ్యులు గల సుప్రీంకోర్టు ధర్మాసనం, ఎన్నికల కమీషనర్లను నియమించే ప్యానెల్ లో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారని చెప్పుకొచ్చింది. ఎన్నికల కమీషనర్ల నియామకం విషయంలో పార్లెమెంటులో చట్టం చేసేవరకు ప్రస్తుత విధానమే అమలులో ఉంటుందని భారత అత్యున్నత న్యాయస్థానం తెలియజేసింది.