
Banakacharla Project : బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి ఒక కీలక లేఖ వచ్చింది. ఈ లేఖలో పోలవరం - బనకచర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తివివరాలను సమర్పించాల్సిందిగా కేంద్ర జల సంఘం కోరింది. గోదావరి నది వరద నీటి లభ్యతపై డేటా సమర్పించాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టుల వివరాలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే,ఇటీవల బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు మంజూరు చేయడం సాధ్యపడదని స్పష్టంచేసింది. బనకచర్ల ప్రాజెక్ట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను తిరస్కరించిన కేంద్రం, ఆ అనుమతులిచ్చే అవకాశం లేదని తేల్చిచెప్పింది.
వివరాలు
సీడబ్ల్యూసీని సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచన
ఈ నేపథ్యంలో, బనకచర్ల ప్రాజెక్ట్‌కు అనుమతులు పొందాలంటే, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలన తప్పనిసరి అని కేంద్రం పేర్కొంది. ఫ్లడ్ వాటర్ అవైలబిలిటీపై సమగ్ర అంచనా వేయాల్సిన అవసరం ఉందని, అందుకు సీడబ్ల్యూసీని సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. అంతేకాకుండా, ఇది అంతరాష్ట్ర జలవివాదానికి సంబంధించింది కావడంతో, సంబంధిత క్లియరెన్స్‌లు పొందేందుకు చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్రానికి సూచించింది.