NCW: జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహత్కర్ నియామకం
జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహత్కర్ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆమె నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది. జాతీయ మహిళా కమిషన్‌లో కొత్త సభ్యురాలిగా డాక్టర్ అర్చన మజుందార్ నియమితులయ్యారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, విజయ కిషోర్ రహత్కర్ మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. రహత్కర్ నియామకంతో పాటు, ఆమె పదవీకాలం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అలాగే, అర్చన మజుందార్ కూడా మూడేళ్ల పాటు సభ్యురాలిగా కొనసాగుతారని వెల్లడించింది. ఈ నియామకాలు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా నోటిఫికేషన్ విడుదలైంది.