IVF Case: మూసేవాలా తల్లికి IVF చికిత్స.. చట్టబద్ధతను ప్రశ్నించిన కేంద్రం
దివంగత పంజాబీ పాప్ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లి ఇటీవల ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా మరో శిశువుకు జన్మనిచ్చారు. అయితే, ఈ విషయం ప్రస్తుతం వివాదాస్పదమైంది. అయితే,కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలు మాత్రమే IVFకి అర్హులని తెలిపింది. దివంగత గాయకుడి తల్లి చరణ్ కౌర్ వయసు 58 ఏళ్లు. మే 29, 2022న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో 28ఏళ్ళ సిద్దూ మూసేవాలా హత్యకు గురయ్యారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ జంట తమ రెండవ బిడ్డకు జన్మనించింది. ఈ విషయమై మార్చి 14న పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. చరణ్ కౌర్ IVF చికిత్సకు సంబంధించి నివేదికను కోరింది.
కేంద్రం నివేదిక కోరగా.. ఆప్ ప్రభుత్వం స్పందించింది
ఫిబ్రవరి 27న ఒక వార్తాపత్రిక కథనం ఆధారంగా , చరణ్ కౌర్ బిడ్డ కోసం IVF చికిత్స తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలుసుకుంది. పంజాబ్ ప్రభుత్వం కేంద్ర మంత్రిత్వ శాఖ లేఖను ధృవీకరిస్తూ.. పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతృత్వంలోని ప్రభుత్వం బుధవారం ట్వీట్ చేసింది. "ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎల్లప్పుడూ పంజాబీల మనోభావాలను, గౌరవాన్ని గౌరవిస్తారని, పత్రాలను కోరింది కేంద్ర ప్రభుత్వం డాక్యమెంట్స్ కావాలని కోరింది'' అని ట్వీట్ చేసింది. కేంద్రం నివేదిక కోరగా.. ఆప్ ప్రభుత్వం స్పందించింది. వాస్తవాలను పరిశీలించాలని, ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరింది.
పంజాబ్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందన్న బల్కౌర్ సింగ్
మంగళవారం, సిద్ధూ మూసే వాలా తండ్రి బల్కౌర్ సింగ్ మాట్లాడుతూ.. భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం మార్చి 17న జన్మించిన తమ రెండవ కుమారుడిని వేధింపులకు గురిచేస్తోందని, "బిడ్డకు సంబంధించిన పత్రాలను అందించమని" అడుగుతున్నట్లు ఆరోపించారు. ఈ చిన్నారికి చట్టబద్ధత ఉందని నిరూపించేందుకు నన్ను ప్రశ్నిస్తున్నారు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలో పేర్కొన్నాడు. అయితే, ఐవిఎఫ్ చికిత్స ద్వారా ఈ జంటకు రెండవ బిడ్డ పుట్టినట్లు అయన పేర్కొనలేదు. తాను అన్ని చట్టపరమైన విధానాలను అనుసరించినందున అన్ని పత్రాలను అందజేస్తానని బాల్కౌర్ సింగ్ చెప్పారు.