Page Loader
హీరో విశాల్ లంచం ఆరోపణలపై కేంద్రం సీరియస్‌‌.. అవినీతిని సహించేది లేదని స్పష్టం
అవినీతిని సహించేది లేదని స్పష్టం

హీరో విశాల్ లంచం ఆరోపణలపై కేంద్రం సీరియస్‌‌.. అవినీతిని సహించేది లేదని స్పష్టం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 29, 2023
06:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ, తెలుగు నటుడు విశాల్ కేంద్ర సెన్సార్ బోర్డుపై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విశాల్ వ్యాఖ్యలపై విచారించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెన్సార్ బోర్డ్‌పై అవినీతి ఆరోపణలు రావడం బాధాకరమని పేర్కొంది. అవినీతిని కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని తేల్చి చెప్పింది.అవినీతికి పాల్పడినట్లు నిరూపణ అయితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించింది. మార్క్ ఆంటోనీ సినిమా సెన్సార్ అంశంలో దాదాపుగా రూ.6.5 లక్షల లంచం ఇచ్చానని విశాల్ ట్వీట్ చేశారు. స్క్రీనింగ్ కోసం రూ.3.5 లక్షలు, సర్టిఫికెట్ కోసం మరో రూ.3 లక్షలు సమర్పించుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ప్రధాని మోదీ, మహా సీఎం ఏక్ నాథ్ షిండే దృష్టికి తీసుకువెళ్తానన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సెన్సార్ బోర్డులో లంచం ఆరోపణలు చేసిన కేంద్రం సీరియస్‌‌